Rivalry Over Sale Fish: చేపల విక్రయంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన తమిళనాడులోని డిండిగుల్ జిల్లాలో జరిగింది. ఇరు వర్గాల ప్రజలు పదునైన ఆయుధాలతో దాడి చేసుకున్నారు. ఇళ్లపై పెట్రోల్ బాంబులు విసురుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు.
"సోమవారం ఉదయం చేపలు అమ్మే సమయంలో జరిగిన ఘర్షణ ఈ హింసకు కారణం. అదే రోజు అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పెట్రోల్ బాంబులు విసిరడం వల్ల ఐదు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పరిసరాల్లో పార్క్ చేసిన వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. హింసకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం" అని పోలీసులు తెలిపారు.
చేపల విక్రయం తెచ్చిన తంటా.. పెట్రోల్ బాంబులతో రెండు గ్రూపుల దాడి - పెట్రోల్ బాంబులు
Rivalry over sale of fish: చేపల విక్రయంపై పోటీ ఆ గ్రామంలో హింసకు దారితీసింది. ఉదయం ఘర్షణ పడిన రెండు గ్రూపులు.. సోమవారం అర్ధరాత్రి పదునైన ఆయుధాలు, పెట్రోల్ బాంబులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు.
Rivalry over sale of fish leads to violence in TN village