క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు సోషల్‌మీడియాలో ఊహించని సంఘటన ఎదురైంది. ఆమె నిర్వహించిన ట్విట్టర్ పోల్‌కు వచ్చిన ఫలితాలను చూసి కంగుతిన్నారు. "గుజరాత్ అసెంబ్లీలో విజయం ఎవరిది" అని ఆమె ట్విటర్ పోల్ నిర్వహించగా ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. దీంతో ఆమె ఆ పోస్ట్‌ను తొలగించింది. "దేశ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు" అన్న పోస్ట్‌కు సైతం ఆమెకు ఊహించినట్లుగా స్పందన రాలేదు.
ట్విట్టర్ పోల్‌లో జడేజా భార్యకు ఊహించని షాక్.. ఆ పోస్ట్ తొలగింపు - రివాబా జడేజా ట్విటర్ పోల్
క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు సోషల్‌మీడియాలో ఊహించని షాక్ తగిలింది. గుజరాత్ అసెంబ్లీలో విజయం ఎవరిది, దేశ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అంటూ ఆమె నిర్వహించిన ట్విట్టర్ పోల్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో ఆమె తమ పోస్ట్‌ను తొలగించింది.
కాగా, క్రికేటర్ జడేజా భార్య రివాబా జడేజా భాజాపాలో చేరిన విషయం తెలిసిందే. ఆమె గుజరాత్‌లోని జామ్‌నగర్ నార్త్ నుంచి పోటి చేస్తున్నారు. గుజరాత్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ ఏర్పాటుపై సోషల్ మీడియా వేదికగా చాలా సర్వేలు జరుగుతున్నాయి. అయితే రివాబా జడేజా కూడా "గుజరాత్ అసెంబ్లీలో విజయం ఎవరిది" అంటూ ట్విటర్లో ఒపినియన్ పోల్ నిర్వహించారు. అయితే ఫలితాలు మాత్రం ఆమె ఊహించినట్లుగా రాలేదు. ఈ పోల్‌లో 63 శాతం మంది ఆప్‌కు మద్దతు ఇవ్వగా, 25 శాతం భాజాపాకు మద్దతిచ్చారు. మరో 10 శాతం మంది కాంగ్రేస్కు మద్దతు తెలిపారు.
"దేశ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు" అంటూ ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ పేర్లను జత చేసిన మరో పోస్టుకు ప్రతికూల ఫలితాలే వచ్చాయి. అరవింద్ కేజ్రీవాల్‌కు 68 శాతం ఓటు వేయగా, నరేంద్ర మోదీకి 22 శాతం మంది మద్దతు ఇచ్చారు. రాహుల్ గాంధీకి 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.