కేరళలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ కొత్తగా 15,637 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి మరో 128 మృతిచెందారు. దీనితో రాష్ట్రంలో కేసుల సంఖ్య 31,03,310కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 14,938కి పెరిగింది. ప్రస్తుతం కేరళలో 1,17,708 యాక్టివ్ కేసులున్నాయి.
మలప్పురం జిల్లాలో అత్యధికంగా 2030 కేసులు నమోదు కాగా.. కోజికోడ్‌లో 2022, ఎర్నాకుళంలో 1894 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కొత్తగా నమోదైన కేసుల్లో.. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చిన వారి ద్వారానే అత్యధిక కేసులు (14,717) వెలుగుచూసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 10.03 శాతంగా ఉందని తెలిపింది.