కేరళలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అక్కడ కొత్తగా 19,451 మందికి కరోనా సోకగా.. 19,104 మంది కోలుకున్నారు. 105 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్రంలో కేసుల వివరాలు..
మొత్తం కేసులు : 36,51,089
కోలుకున్నవారు : 34,72,278
మృతుల సంఖ్య : 18,499
మహారాష్ట్రలో కొత్తగా 5,787 మందికి కరోనా సోకింది. 5,352 మంది కోలుకోగా.. 134 మంది మృతిచెందారు.
మిగతా రాష్ట్రాల్లో ఇలా..
- తమిళనాడులో 1,916 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి 34 మంది బలయ్యారు.
- కర్ణాటకలో కొత్తగా 1,632 కేసులు నమోదయ్యాయి. 1,612 మంది కోలుకోగా.. 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఒడిశాలో కొత్తగా 1,132 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 66 మంది మృతిచెందారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా 42 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా ఒకరు చనిపోయారు.
- బంగాల్లో కొత్తగా 705 మందికి వైరస్ సోకింది. కొవిడ్ కారణంగా మరో 15 మంది మరణించారు.
ఇదీ చూడండి:వ్యాక్సిన్ వేసుకున్న, వేసుకోని వారిలో కరోనా లక్షణాలు ఇవే..!