దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మరణాలు.. 3 లక్షలు దాటాయి. ఈ జాబితాలో అమెరికా, బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
తమిళనాడులో ఒక్కరోజులో 35,483 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 422 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17 లక్షలకు చేరింది.
వివిధ రాష్ట్రాల్లో కేసులు, మరణాల వివరాలు..
- మహారాష్ట్రలో 26,672 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 594 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
- కేరళలో తాజాగా 25,820 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 188 మంది చనిపోయారు.
- కర్ణాటకలో ఒక్కరోజే 25,979 మందికి వైరస్ సోకగా.. మరో 626 మంది మృతి చెందారు.
- బంగాల్లో మరో 18,422 మంది పాజిటివ్‌గా తేలగా.. మరో 156 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు నిపుణులు విశ్లేషించారు. ఈ నేపథ్యంలోనే మహమ్మారి నివారణకు పలు రాష్ట్రాలు లాక్డౌన్, కర్ఫ్యూలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
- గోవాలో ఈ నెల 31 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- రాజస్థాన్ ప్రభుత్వం 15 రోజుల పాటు(జూన్ 8 వరకు) లాక్‌డౌన్‌ను పొడిగించింది.
- దేశ రాజధానిలో మరో వారం పాటు లాక్డౌన్ కొనసాగుతుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
- హరియాణాలో మే 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది ప్రభుత్వం.
- పుదుచ్చేరిలో మే 31వరకు ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:21 రోజుల్లో 341 మంది పిల్లలకు కరోనా
గంగానది ఒడ్డున ఇసుకలో భారీగా మృతదేహాలు