ప్రపంచంలోని చాలా దేశాలల్లో ప్రజలు ఓటు హక్కు కోసం దశాబ్దాల తరబడి పోరాడాల్సి వచ్చిందని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఎంతో శ్రమపడి సాధించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ గౌరవించి, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతీయువకులపై ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉందన్నారు.
11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన అమెరికాలో కూడా ఓటు హక్కు కోసం ప్రజలు చాలా కాలం పోరాడారని గుర్తు చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటన్లో చాలా కాలం పాటు మహిళలకు ఓటు హక్కు లేదని తెలిపారు.