దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపడుతున్న ఆందోళనల వల్ల దిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రభుత్వ రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(ఆర్జీఎస్ఎస్హెచ్-దిల్లీ) నోడల్ అధికారి డాక్టర్ అజిత్ జైన్ అన్నారు. అన్నదాతల నిరసనలతో సరిహద్దులను దిగ్బంధించడం వల్ల.. దిల్లీ కంటైన్మెంట్ జోన్‌గా మారేందుకు తోడ్పడిందని చెప్పారు జైన్. ఫలితంగా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.
'రైతుల నిరసనలతో.. దిల్లీలో కరోనా తగ్గుముఖం!' - దిల్లీ రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ అజిత్ జైన్
సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపడుతున్న ఆందోళనలతో దిల్లీలో కరోనా వ్యాప్తి తగ్గిందని దిల్లీ ప్రభుత్వ వైద్యశాల నిపుణులు అభిప్రాయపడ్డారు. రైతుల నిరసనలతో సరిహద్దులను మూసివేయడం వల్ల.. కొద్దిరోజులుగా రోజువారి వైరస్ కేసుల్లో తగ్గుదల నమోదవడమే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు.
'రైతుల నిరసనలతో.. దిల్లీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం!'
రైతు ఉద్యమంతో కరోనా వాప్తి గొలుసును విచ్ఛిన్నం చేసిందని.. ఫలితంగా కొవిడ్-19 అదుపులోకి వచ్చిందని పేర్కొన్నారు ఆర్జీఎస్ఎస్హెచ్ వైద్య నిపుణులు. వైరస్‌కు వ్యాక్సిన్ రాకపోయినా, ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పులు లేకపోయినా.. దిల్లీలో కొన్ని రోజులుగా రోజువారీ కేసులు, మరణాల సంఖ్య తగ్గడమే ఇందుకు నిదర్శనమని వారు చెప్పుకొచ్చారు.