కుప్పకూలిన ట్రైనీ విమానం.. పైలట్ మృతి.. గుడి గోపురానికి ఢీకొట్టడం వల్లే!
పైలట్ల శిక్షణ కోసం ఉపయోగించే ట్రైనింగ్ ప్లేన్ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ మృతి చెందగా.. ట్రైనీ తీవ్రంగా గాయపడ్డాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిందీ ప్రమాదం.
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రీవా నగరంలోని ఎయిర్‌స్ట్రిప్‌పై ఓ ట్రైనింగ్ ప్లేన్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పట్నాకు చెందిన కెప్టెన్ విమల్ కుమార్(50) ప్రాణాలు కోల్పోగా.. జైపుర్‌కు చెందిన సోను యాదవ్(23) తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వచ్చారు. గాయపడ్డ వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. పైలట్‌కు తీవ్ర గాయాలు కావడం వల్ల పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతిచెందాడు. చోర్హటా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉమ్రీ గ్రామంలో ఓ ఆలయ గోపురానికి ప్లేన్ ఢీకొట్టడం వల్లే.. ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదం గురువారం రాత్రి 11.30 గంటలకు జరిగినట్టు సమాచారం. ఘటనాస్థలికి అధికారులు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్లేన్ పల్టాన్ ట్రైనింగ్ కంపెనీకి చెందినదిగా సమాచారం.