కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ఆదాయం ఈ ఏడాది భారీగా తగ్గింది. ఈ సంక్రాంతి పండుగ సీజన్లో మంగళవారం నాటికి రూ.16 కోట్లు మాత్రమే వచ్చాయి. గతేడాది వచ్చిన ఆదాయంలో ఇది పది శాతం మాత్రమే.
తగ్గుతున్న ఆదాయం..
2019లో ఆలయ ఆదాయం రూ.166 కోట్లు కాగా, గతేడాది రూ. 60.26 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది కొవిడ్ కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. దుకాణాల అద్దె, ఇతర వనరుల ద్వారా ట్రావెన్కోర్ దేవస్థానానికి వచ్చే ఆదాయం ఈ ఏడాది కోటి రూపాయలకే పరిమితమైంది. ఈ ఆదాయం గతేడాది రూ.6.25 కోట్లుగా ఉంది.