Revanth Reddy Reacts on BRS Manifesto :కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూడగానే కేసీఆర్‌కు చలిజ్వరం వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలనే కేసీఆర్ ఒక్కో వెయ్యి పెంచుతూ కాపీ కొట్టారని మండిపడ్డారు. సొంతంగా ఆలోచన చేసే శక్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోల్పోయారని ఎద్దేవా చేశారు. ఇతర ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టేందుకే కేసీఆర్ సమయం సరిపోతోందని రేవంత్ ఆరోపించారు.
Revanth Reddy Fires on KCR :తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితాపై రేవంత్రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఎన్నికల కమిటీ ఎంపిక చేసిందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగానే కేసీఆర్ తన అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చారని ఎద్దేవాచేశారు. 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. 51 మందికే బీ ఫారాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రకటించినవి అసాధ్యం అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మేనిఫెస్టోలో ఎలా పెట్టారని రేవంత్రెడ్డి ఫైర్ అయ్యారు. ఒకప్పుడు కేసీఆర్ అడుగుల్లో ఇతర పార్టీలు నడుస్తాయని అనేవారని.. ఇప్పుడు ఆలోచనలు క్షీణించిన ఆయన.. కాంగ్రెస్‌ను అనుసరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు సాధ్యమే అని ఇవాళ కేసీఆర్ రాజముద్ర వేశారని తెలిపారు. కాంగ్రెస్‌ను విమర్శించే అర్హతను బీఆర్ఎస్ నేతలు కోల్పోయారని చెప్పారు. కాంగ్రెస్ చెప్పినవి అసాధ్యమంటూనే కొంచెం పెంచి బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టారని రేవంత్రెడ్డి విమర్శించారు.
Revanth Reddy Challenge to KCR :9 ఏళ్లల్లో దోచుకున్న రూ.లక్ష కోట్లతో జాతీయ రాజకీయాలు చేస్తానని తిరిగింది ఎవరు? అని రేవంత్రెడ్డి నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో తాము డబ్బు, మద్యం పంపిణీ చేయమని ప్రమాణం చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ కూడా డబ్బు, మద్యం పంచదని కేసీఆర్ ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు. ఈనెల 17న అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ప్రమాణం చేస్తానని.. అదేవిధంగా కేసీఆర్ కూడా అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఈనెల 17న మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణం చేసేందుకు రావాలని కేసీఆర్‌కు రేవంత్రెడ్డి సవాల్ విసిరారు.