తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రజా ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ప్రజలందరికీ రేవంత్‌రెడ్డి బహిరంగ ఆహ్వానం

Revanth Reddy Invitation to Public : రాష్ట్ర ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ ఆహ్వానం పంపారు. రేపు ఎల్బీ స్టేడియంలో జరగబోయే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ప్రజలందరూ రావాలని ఆ ఆహ్వానంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యస్థాపనకు సమయం ఆసన్నమైందని లేఖలో స్పష్టం చేశారు.

Revanth Reddy Invitation Letter
Revanth Reddy Invitation Letter for CM Oath Swering Ceremony

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 5:18 PM IST

Updated : Dec 6, 2023, 5:44 PM IST

Revanth Reddy Invitation Letter to Public for CM Oath Swering Ceremony : గురువారం ఎల్బీస్టేడియంలో జరగబోయే తన ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ప్రజలందరూ హాజరుకావాలనిరేవంత్‌రెడ్డి(Revanthreddy) బహిరంగ ఆహ్వానం పంపారు. ప్రజా ప్రభుత్వ స్వీకారానికి ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యస్థాపనకు సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.

revanth reddy invitation letter

కాంగ్రెస్​ ప్రభుత్వంలో ఈమెకే తొలి ఉద్యోగం

Revanth Reddy Invitation Letter :"తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, శ్రీమతి సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్యస్థాపనకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7న మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఈ మహోత్సవానికి అందరూ రావాలి" అంటూ బహిరంగ ఆహ్వాన పత్రం విడుదల చేశారు.

'ప్రగతి అంటే ఏమిటో రేవంత్ పాలనలో ప్రజలకు అర్థమవుతుంది'

AICC Invitations to All Sates PCC Chiefs : గురువారం జరగబోయే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ముఖ్య నేతలకు గాంధీభవన్‌ ఆహ్వానాలు పంపింది. అలాగే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలకు సైతం ఇన్విటేషన్లు పంపింది. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులకు ఆహ్వానాలు పంపారు.

Traffic Rules on Revanth Swearing Ceremony :రేపు సీఎంగా రేవంత్‌ ప్రమాణస్వీకారం నేపథ్యంలో పోలీసులు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్లు తెలిపారు. పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలు నాంపల్లివైపు, ఎస్బీఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు, బషీర్‌బాగ్‌ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్‌ కోఠి వైపు, సుజాత స్కూల్‌ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లింపు ఉంటుందని పేర్కొన్నారు.

హస్తినలో కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్​ రెడ్డి - ప్రమాణస్వీకారానికి రానున్న సోనియా గాంధీ

Last Updated : Dec 6, 2023, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details