Revanth Reddy Chit Chat : సీఎం కేసీఆర్ ఓటమి భయంతో రైతుబంధు (Rythu Bandhu) నిధులను ఇతర కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు మళ్లిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ధ్వజమెత్తారు. కమీషన్‌ల కోసం రైతుబంధు నిధులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో రేపు తెలంగాణ ఛీప్ ఎలక్షన్ అధికారి వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
ప్రభుత్వ అన్ని లావాదేవీలపై నిఘా పెట్టాలి :హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ జరుగుతుందని, ప్రభుత్వ అన్ని లావాదేవీలపై నిఘా పెట్టాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని రేవంత్ తెలిపారు. ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్‌లో అటు దిల్లీలోనూ ఎన్నికల సంఘం, ఎన్నికల కమీషన్‌ను ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని జూమ్ మీటింగ్‌లో తాము చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తనతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మహేశ్ కుమార్ గౌడ్ తదితరులతో ఈసీని కలుస్తామన్నారు.
Revanth Reddy on Telangana Exit Polls Results 2023 :మరోవైపురాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్(Exit Polls 2023) సర్వేలు అధికారం దక్కించుకునేది కాంగ్రెస్ పార్టీయే అని ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎక్స్(ట్విటర్) వేదికగా కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశిస్తూ ధన్యవాదాలు తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ అంతే - అసలైన ఫలితాలు మాకు శుభవార్త చెబుతాయి : కేటీఆర్