Returning Officer Reena Dwivedi: 2019 యూపీ లోక్‌సభ ఎన్నికల సమయంలో పసుపు రంగు చీరలో తళుక్కున మెరిసిన రీనా ద్వివేది గుర్తున్నారా? ఆ ఒక్క ఫొటోతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు ఆ ఉత్తరప్రదేశ్ ఎన్నికల అధికారి. ఎల్లో శారీ, చలువ కళ్లజోడు, ఓ చేతిలో ఈవీఎం ఉన్న బ్యాక్స్, మరో చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని అందంగా కనిపించిన ఆ యువ అధికారి.. అప్పట్లో సామాజిక మాధ్యమాలను షేక్ చేశారు.
ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి అదిరే లుక్‌లో కనిపించారు. ఈసారి కాస్త స్టైలిష్‌గా. ట్రెండీ డ్రెస్‌కు తోడు కళ్లజోడు, ఓ చేతిలో ఈవీఎం బాక్స్, మరో చేతిలో హాండ్ బ్యాగ్, సెల్ ఫోన్‌తో దర్శనమిచ్చారు. ఎన్నికల విధుల కోసం వచ్చిన ఆమెను చూసి పోలింగ్ సిబ్బంది సెల్ఫీల కోసం ఎగబడడం విశేషం.
ఆ అధికారి వస్త్రధారణ చూసి అక్కడి అధికారులు, జనం ఆశ్చర్యపోయారు.
బుధవారమే నాలుగో దశ పోలింగ్..
UP Election 4th Phase: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ బుధవారం జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు.
ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌కు 48 గంటల ముందే (సోమవారం సాయంత్రం) ప్రచారం ముగిసింది. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నం చేశాయి.
గతేడాది అక్టోబర్ 3న విధ్వంసం జరిగిన లఖింపుర్ ఖేరీలో ఈ దశలోనే పోలింగ్ జరగనుంది. నిరసన చేస్తున్న వారిపై కారు దూసుకెళ్లగా నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ఈ ఘటనలో మరణించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ఓటర్లు ఎవరిని కనికరిస్తారో చూడాలి.
ఎన్నికలు జరిగే స్థానాలు : 59