తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శునకాల పెంపకంలో మాజీ జవాను అభిరుచి భిన్నం - ఉడుపిలో శునక ప్రేమికుడు

కేరళకు చెందిన ఓ మాజీ సైనికుడు వివిధ రకాల అరుదైన శునకాలను పెంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అంతే కాదండోయ్​.. కుందేళ్లు, పిల్లులు, పక్షులు, తాబేళ్లు, అరుదైన చేపలు ఆయన వద్ద ఉన్నాయి. తన ఇంట్లో వ్యక్తుల్లా వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు.

dog lover
శునకాల పెంపకంలో మాజీ సైనికుడి అభిరుచి

By

Published : Feb 14, 2021, 2:28 PM IST

శునకాల పెంపకంలో మాజీ సైనికుడి అభిరుచి

కర్ణాటక ఉడుపి పరిధిలోని ఖడేకర్​కు చెందిన నవీన్.. 11 సంవత్సరాల పాటు సైన్యంలో సేవలందించి పదవీ విరమణ పొందారు. ఆయనకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. సైన్యం నుంచి తిరిగి వచ్చాక.. కొన్ని శునకాలను కొనుగోలు చేసి పెంపకం ప్రారంభించారు. ఎక్కడ కొత్త రకం ఉందని తెలిసినా అక్కడికి వెళ్లి తెచ్చుకుంటారు. ఇలా.. ప్రస్తుతం ఆయన వద్ద ఎన్నో అరుదైన స్వదేశీ, విదేశీ జాతుల జాగిలాలు ఉన్నాయి.

వాటిని తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు నవీన్​. ఆయన వచ్చారంటే చాలు.. వాటికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఒకదాన్ని మించి ఒకటి పోటీ పడుతూ ఆయన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తాయి.

''నా సొంత ఖర్చులతో వీటి ఆలనాపాలనా చూసుకుంటున్నా. రోజుకు కనీసం రూ.1000 ఖర్చవుతోంది. సొంత వ్యాపారం నుంచే డబ్బు సమకూర్చుకుంటున్నా. ఎప్పటికప్పుడు వైద్యుల సూచనల మేరకు ఔషధాలు, టీకాలు అందిస్తున్నాం''.

- నవీన్​, మాజీ సైనికుడు

మాజీ జవాను వద్ద శునకాలే కాదండీ.. పిల్లులు, కుందేళ్లు, పక్షులు, తాబేళ్లు, చేపలు సహా.. రోట్వీల్లర్, అమెరికన్ బుల్లీ, సైబీరియన్ హస్కీ వంటి వివిధ జాతుల కుక్కలున్నాయి.

ఇదీ చదవండి:మూగజీవాల ఆకలి తీర్చిన జంతు ప్రేమికుడు

వందలాది శునకాలకు ఇంట్లో ఆశ్రయమిచ్చాడు!

మూగజీవాల ఆకలి తీర్చే 'రోటీ వ్యాన్​'

ABOUT THE AUTHOR

...view details