విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి శ్యామ్యూల్ ఇంట్లో చోరీ కేసు Retired IRS house Robbery case latest update : విశ్రాంత ఐఆర్ఎస్ శామ్యూల్ ప్రసాద్ ఇంటి చోరీ కేసు కొత్త మలపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దుండిగల్ ఎస్సై కృష్ణను సస్పెండ్ చేశారు. ఆయన్ను అధికారికంగా సస్పెండ్ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టిఫెన్ రవీంద్ర తెలిపారు.
ఇదీ జరిగింది :ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విశ్రాంత ఐఆర్ఎస్ అధికారికి శామ్యూల్‌కి కోట్ల విలువైన భూములున్నాయి. పదవీ విరమణ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రియల్ వ్యాపారం చేస్తున్నారు. స్తిరాసి లావాదేవీల్లో దళారీగా వ్యవహరించే ఆశీర్వాదం ఎస్సై కృష్ణకు పరిచయమయ్యాడు. ఆయన ద్వారా శామీర్‌పేట్‌లోని శామ్యూల్ ప్రసాద్ భూములను కొనుగోలు చేసిన ఎస్సై.. విశ్రాంత అధికారికి భారీగా ఆస్తులున్నట్టు తెలుసుకున్నాడు.
SI Krishna Suspend in Retired IRS Robbery Case :భార్య మరణించటం, పిల్లలు అమెరికాలో ఉండటంతో అతడిని ఏమార్చటం చాలా తేలిక అని భావించిన ఎస్సై సమయం కోసం ఎదురు చూశాడు. అప్పటికే ఫార్మా రంగంలో అనుభవం ఉన్న సురేందర్‌తో.. పరిచయం కాగా అతను శామ్యూల్ ప్రసాద్‌కు ఎస్సైని దగ్గర చేశాడు. తరచూ గాంధీనగర్‌లోని విశ్రాంత అధికారి ఇంటికి వెళ్లటం, అవసరమైన సేవలు చేయటం ద్వారా నమ్మకం ఏర్పరచుకున్నాడు. శామ్యూల్ వద్ద ఉన్న భూమి పత్రాలు కొట్టేసి, పరిచయం ఉన్న రెవెన్యూ, రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగుల ద్వారా తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
పథకాన్ని అమలు చేసేందుకు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పాతనేరస్తుడు శ్రీశైలంతో ఎస్సై మంతనాలు చేశాడు. అతడి ద్వారానే అదే జిల్లాకు చెందిన సుమలత అనే మహిళ విశ్రాంత అధికారి ఇంట్లో పనికి కుదిర్చారు. ఆమె ద్వారా ఇంట్లోని విలువైన వస్తువులు, భూమి పత్రాలు భద్రపరిచే ప్రాంతాలను తెలుసుకున్నారు. మే 31న సురేందర్ గాంధీనగర్‌లోని శామ్యూల్ ప్రసాద్ నివాసానికి వెళ్లి వెంట తీసుకెళ్లిన ఇడ్లీ, కొబ్బరి నీటిలో మత్తుమందుకలిపి శామ్యూల్ ప్రసాద్‌కు ఇచ్చాడు.
Retired IRS House Theft Case : అపస్మారకసితికి చేరాక ఇంట్లోని ఆభరణాలు, భూపత్రాలు దోచుకొని వెళ్లిపోయాడు. కొట్టేసిన భూముల పత్రాలను దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లోని ఎస్సై కృష్ణకి సురేందర్ అందించాడు అక్కడ నుంచి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసి విశాఖకి మకాం మార్చాడు. అపస్మారకసితిలో ఉన్న బాధితుడిని బంధువులు ఆసుపత్రిలోకి చేర్చారు. నాలుగు రోజులు కోలుకున్న శ్యామూల్ ప్రసాద్ ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. అక్కడి సిబ్బంది పట్టించుకోపోవటంతో డీజీ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. డీజీ ఆదేశాలతో ముషీరాబాద్ పోలీసులు ఆగమేఘాల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సురేందర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో భూముల పత్రాలు ఎస్సైకి ఇచ్చినట్లు తెలిపాడు. ఎస్సైని ప్రశ్నిస్తే తనకేం తెలియదని బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. సాంకేతిక ఆధారాలు చూపటంతో విశ్రాంత అధికారి ఇంట్లో మాయమైన భూముల పత్రాలను తన వద్దే ఉన్నట్టు ఎస్సై అంగీకరించి పోలీసులకు ఇచ్చాడు. సురేందర్‌ను కస్టడీకి తీసుకొని విచారించటంతో సుమలత, ఆశీర్వాదం, శ్రీశైలం పేర్లు బయటకు వచ్చాయి. ఆ ముగ్గురినీ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సురేందర్ మూడ్రోజుల పోలీసు కస్టడీ ముగియటంతో శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చదవండి: