మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అయితే.. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని చెన్నై స్టాన్లీ మెడికల్ కాలేజీ వైద్యులు తెలిపారు.
కొద్ది రోజులుగా చెన్నైలోని ఓ జైలులో ఉంటున్నారు జస్టిస్ కర్ణన్. అనారోగ్యంగా ఉందని చెప్పగా జైలు అధికారులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
"అలసటతో ఆయన మంగళవారం మా ఆసుపత్రికి వచ్చారు. అప్పుడాయనకు సీటీ స్కాన్ చేస్తే ఊపిరితిత్తుల్లో ఏదో సమస్య ఉన్నట్లుగా కనిపించింది. ఆ తర్వాత ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేశాం. బుధవారం వచ్చిన ఆ ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం.. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉంది. వారం క్రితం చేసిన కరోనా పరీక్షల్లో కర్ణన్‌కు నెగెటివ్‌గానే వచ్చింది."