కాంగ్రెస్ అసంతృప్త నేతలు(జీ-23) జమ్ముకశ్మీర్‌లో ఏర్పాటు చేసిన 'శాంతి సమ్మేళన్' కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. తాను రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యాను కానీ.. రాజకీయాల్లోంచి కాదన్నారు. జమ్ముకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా వచ్చేంతవరకూ, కశ్మీర్‌లోని స్థానికుల ఉద్యోగాలు, హక్కుల కోసం పోరాడతానన్నారు.
" నేను రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యాను.. కానీ రాజకీయాల నుంచి కాదు. చివరి శ్వాస వరకూ దేశం కోసం సేవ చేస్తా. ప్రజల హక్కుల కోసం పోరాడతా."
-- గులాంనబీ ఆజాద్, కాంగ్రెస్ సీనియర్ నేత