తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫోన్లో ఎక్కువ సేపు గడుపుతున్నాడని గన్​తో కాల్చిన తండ్రి

కుమారుడు ఎక్కువ సేపు ఫోన్లో గడుపుతున్నాడని గన్​తో కాల్చాడో తండ్రి. గాయాలపాలైన కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. గుజరాత్​లోని కామ్​రెజ్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగిందీ ఘటన.

Retired Army Man Fired Son
Retired army man fired on his son due to usage of mobile instead of studying

By

Published : Aug 20, 2022, 10:34 AM IST

Retired Army Man Fired Son: పని నుంచి వచ్చేసరికి ఫోన్​తో ఆడుకుంటూ కనిపించడం వల్ల కోపోద్రిక్తుడైన తండ్రి, కుమారుడిని మందలించాడు. మొబైల్​ ఫోన్​కు బానిసయ్యాడని గన్​తో కాల్చాడు. ఈ ఘటన గుజరాత్​ కామ్రేజ్​ పరిసర ప్రాంతమైన వవ్​ గ్రామంలో జరిగింది.
వివరాల ప్రకారం.. ధర్మేంద్ర ఓంప్రకాశ్ సకియా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. సూరత్​లో బాడీగార్డ్​గా పనిచేస్తున్నాడు. వవ్​ గ్రామంలోని చంద్ర దర్శన్ సొసైటీలో కుటుంబంతో పాటు నివాసం ఉంటున్నాడు. అతనికి తొమ్మిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి కుమారుడు చదవకుండా ఎక్కువ సేపు ఫోన్లో గడుపుతూ కనిపించాడు. దీంతో ఓంప్రకాశ్ కుమారుడిని మందలించాడు. ఇదే విషయమై భార్యతో కాసేపు వాగ్వాదం అయింది. ఈ సమయంలో కుమారుడు ఇల్లు తుడిచే వైపర్​తో తండ్రిని రక్తం వచ్చేటట్లు కొట్టాడు. దీంతో కోపానికి గురైన ఓంప్రకాశ్ తవ వద్ద ఉన్న లైసెన్స్ గన్​తో కుమారుడి మోచేతిపై రెండు రౌండ్లు కాల్చాడు.

చికిత్స పొందుతున్న బాలుడు

గన్​ శబ్ధం పెద్దగా వినిపించడం వల్ల సొసైటీలో ఉన్నవారు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై బాలుడి తల్లి సంగీతాబెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి గన్ సీజ్​ చేశామని కామ్రేజ్ పోలీసులు చెప్పారు. నిందితుడి కుమారుడు ఖొల్వాడ్​లోని దీనబంధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details