జేఈఈ మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ). ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో దిల్లీకి చెందిన ప్రవర్ కటారియా, రంజిమ్ ప్రబల్ దాస్లతో పాటు.. గుర్ముత్ సింగ్(చండీగడ్), సాకేత్ ఝా(రాజస్థాన్), సిద్ధాంత్ ముఖర్జీ(మహారాష్ట్ర), అనంత కృష్ణ కిదాంబి(గుజరాత్)లు ఉన్నారు.
ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి.చేతన్ మనోజ్ఞ సాయి 99.99 పర్సంటైల్ సాధించాడు. తెలంగాణలో చల్లా విశ్వనాథ్, కొమ్మ శరణ్య 99.99 పర్సంటైల్‌తో టాపర్లుగా నిలిచారు.