తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్​, పీసీల దిగుమతిపై నిషేధం.. ధరలు పెరుగుతాయా? - ట్యాబ్స్​ దిగుమతులపై కేంద్రం ఆంక్షలు

Restrictions On Import Of Laptop : విదేశాల నుంచి ల్యాప్‌టాప్‌లు , ట్యాబ్లెట్లు , పర్సనల్‌ కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, దీనికి కొన్ని మినహాయింపులు ఇచ్చింది. చైనా నుంచి దిగుమతులు తగ్గించుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

restrictions-on-laptops-and-tablets-tablets, personal computers imposes by central Govt
ల్యాప్‌టాప్‌లు దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు

By

Published : Aug 3, 2023, 2:17 PM IST

Updated : Aug 3, 2023, 2:31 PM IST

Restrictions On Import Of Laptop : విదేశాల నుంచి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, వ్యక్తిగత కంప్యూటర్లు, అల్ట్రా స్మాల్‌ ఫామ్‌ ఫ్యాక్టర్‌ కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై తక్షణమే ఆంక్షలు విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్.. DGFT నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మైక్రో కంప్యూటర్లు, పెద్దవి సహా మెయిన్‌ఫ్రేమ్‌ కంప్యూటర్లు, కొన్ని డేటా ప్రాసెసింగ్‌ మెషీన్లపై కూడా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వీటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి తగిన లైసెన్స్‌ కలిగి ఉండాలి. బ్యాగేజీ రూల్స్‌ కింద చేసుకునే దిగుమతులకు ఈ ఆంక్షలు వర్తించబోవని కేంద్రం స్పష్టం చేసింది.

బ్యాగేజీ రూల్స్‌ అంటే.. దేశంలోకి ప్రవేశించే ప్రతి ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్‌ అధికారులుతనిఖీలు చేస్తారు. దీని ప్రకారం.. విదేశాల్లో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు కొనుగోలు చేసి కస్టమ్స్‌ వద్ద సరైన ధ్రువపత్రాలు చూపిస్తే వాటిని అనుమతిస్తారు. ఇక ఈ కామర్స్‌ పోర్టల్స్‌లోకొనుగోలు చేసి పోస్ట్ లేదా కొరియర్‌ ద్వారా దిగుమతి చేసుకునే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించినట్లు కేంద్రం వెల్లడించింది. ఒక్కొటి చెప్పున వీటిని దిగుమతి చేసుకుంటే లైసెన్స్‌ అవసరం లేదు. అంతేగాక, రీసర్చ్‌ అండ్ డెవలప్‌మెంట్‌, టెస్టింగ్‌, బెంచ్‌మార్కింగ్‌, మరమ్మతులు, రీ-ఎక్స్‌పోర్ట్‌, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్‌ కోసం దిగుమతి చేసుకునే వాటికి కూడా ఈ ఆంక్షలు వర్తించబోవని పేర్కొంది. వీటికి 20 వస్తువుల వరకు దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇస్తారు. అయితే, ఇలా దిగుమతి చేసుకునే వాటిని ఎట్టి పరిస్థితుల్లో విక్రయించకూడదని స్పష్టం చేసింది. ఇలా దిగుమతి చేసుకున్న ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లను పనిపూర్తయిన తర్వాత ధ్వంసం చేయడమో లేదా తిరిగి ఎగుమతి చేయడమో చేయాలని సూచించింది. ఆంక్షలు విధించిన ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలంటే లైసెన్స్‌ లేదా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.

డ్రోన్ దిగుమతులపై నిషేధం.. వారికి మినహాయింపు!
Ban on Drones: ఏడాది క్రితం.. దేశంలోకి డ్రోన్ దిగుమతులను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్వదేశంలో డ్రోన్​ల తయారీని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వీటికి కొన్ని మినహాయింపులు కూడా ఇస్తున్నట్లు ఆ సమయంలో కేంద్రం వివరించింది. శాస్త్ర పరిశోధన, రక్షణ, భద్రతా ప్రయోజనాల కోసం విదేశాల నుంచి డ్రోన్​లు దిగుమతి చేసుకునేందుకు మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Aug 3, 2023, 2:31 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details