తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజస్థాన్ కేబినెట్ మంత్రుల రాజీనామా - రాజస్థాన్ మంత్రుల రాజీనామా

सीएमआर पर चल रही अहम बैठक में गहलोत कैबिनेट के सभी मंत्रियों ने अपने इस्तीफे सौंप दिये हैं. गोविंद सिंह डोटासरा, रघु शर्मा ओर हरीश चौधरी के हटने के बाद अब 33 में से 16 जिलों में मंत्रिमंडल में कोई प्रतिनिधित्व नहीं है, ऐसे में इन जिलों में प्रतिनिधित्व कैसे दिया जाए, यह बड़ी चुनौती होगी.

rajasthan government
రాజస్థాన్ కేబినెట్ మంత్రుల రాజీనామా

By

Published : Nov 20, 2021, 7:36 PM IST

Updated : Nov 20, 2021, 9:39 PM IST

19:32 November 20

రాజస్థాన్ కేబినెట్ మంత్రుల రాజీనామా

రాజస్థాన్ కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు(Rajasthan cabinet news). ఆదివారం కేబినెట్ పునర్​వ్యవస్థీకరణ(Rajasthan cabinet reshuffle) జరగనున్న నేపథ్యంలో సీఎం అశోక్​ గహ్లోత్ నివాసంలో భేటీ అయిన మంత్రులు.. ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరి రాజీనామాను గహ్లోత్ ఆమోదించారు. గవర్నర్​ను కలిసేందుకు రాజ్​భవన్​కు వెళ్లారు.

రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా సహా మరో మంత్రులు హరీశ్​ చౌదరీ, రఘు శర్మ రాజీనామా చేయడానికి తొలుత ముందుకొచ్చారు. ఈ మేరకు వారు పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆ తర్వాత మంత్రులందరూ రాజీనామా చేశారు. దోతస్రా, హరీశ్ చౌదరీ, శర్మ తాము రాసిన లేఖలో.. పార్టీ కోసం పని చేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ సమావేశం జరగనుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తదుపరి కార్యాచరణపై ఈ భేటీలో అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పాయి. రాజస్థాన్‌ గవర్నర్‌ నివాసంలో రేపు సాయంత్రం 4 గంటలకు కొత్తమంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని పేర్కొన్నాయి.

Last Updated : Nov 20, 2021, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details