Resident Doctors Strike: నీట్- పీజీ 2021 కౌన్సిలింగ్ ఆలస్యాన్ని నిరసిస్తూ.. దిల్లీలో రెసిడెంట్ వైద్యులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. డాక్టర్లు, పోలీసుల మధ్య కాసేపు తోపులాట జరిగింది.
వైద్యులపై దాడిని 'ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ ఆసోసియోషన్' (ఎఫ్ఓఆర్డీఏ) ఖండించింది. నిర్భంధించిన డాక్టర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. శాంతియువతంగా నిరసన చేస్తున్న తమపై.. పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారని ఎఫ్ఓఆర్డీఏ డైరెక్టర్ డాక్టర్. మనీశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల చర్యను బ్లాక్ డేగా అభివర్ణించారు.
డాక్టర్లపై దాడిని అన్నిరాష్ట్రాల్లో ఉన్న రెసిడెంట్ వైద్యుల బృందం ఖండించింది. అన్యాయానికి వ్యతిరేకంగా తాము ప్రారంభించిన పోరాటం సాగుతూనే ఉంటుందని ఎఫ్ఓఆర్డీఏ స్పష్టం చేసింది.