తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సర్పంచ్​గా ఎన్నికైన 21 ఏళ్ల రేష్మా మరియం - కేరళ స్థానిక పీఠంపై మరో అతి పిన్న యువతి

కేరళ పంచాయతీ ఎన్నికల్లో యువతుల హవా కొనసాగుతోంది. 21 ఏళ్ల రేష్మా మరియం.. అరువప్పులం గ్రామ పంచాయతీ సర్పంచ్​గా ఎన్నికయ్యారు.

Reshma Mariam Roy, కేరళ స్థానిక పీఠంపై మరో అతి పిన్న యువతి
సర్పంచ్​గా ఎన్నికైన 21 ఏళ్ల రేష్మా మరియం

By

Published : Dec 30, 2020, 7:57 PM IST

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో యువతి సత్తా చాటారు. పథానంతిట్ట జిల్లాలోని అరువప్పులం గ్రామ పంచాయతీ సర్పంచ్​గా 21ఏళ్ళ రేష్మా మరియం రాయ్​ ఎన్నికయ్యారు. గ్రామంలోని 11వ వార్డు నుంచి ఆమె 70 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

నామినేషన్​ దాఖలు సమయంలోనే రేష్మా అతి చిన్న వయస్కురాలిగా వెలుగులోకి వచ్చారు. 2020, నవంబర్ 18న ఆమె 21వ ఏట అడుగు పెట్టారు. మరుసటి రోజే ఆమె నామినేషన్​ పత్రాలు సమర్పించారు.

ఆది నుంచి చురుకే..

పథానంతిట్ట కొన్నిలోని వీఎన్​ఎస్​ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందిన రేష్మా.. గతంలో పలు సంఘాలలో పని చేశారు. డెమొక్రాటిక్​ యూత్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా (డీవైఎఫ్ఐ​) జిల్లా కమిటీ సభ్యురాలిగా, స్టూడెంట్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా(ఎస్​ఎఫ్​ఐ) జిల్లా సెక్రెటేరియేట్​ సభ్యురాలిగా, కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్​ ఇండియా మార్క్సిస్ట్(సీపీఐఎం) పలు శాఖల్లో కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.

కుటుంబ నేపథ్యం..

రేష్మా తండ్రి రాయ్​ పీ మాథ్య్​ కలప వ్యాపారిగా పని చేస్తుండగా.. తల్లి మిని రాయ్​ సెయింట్​ స్టీఫెన్స్ కళాశాలలో ఉద్యోగి. ఆమెకు ఓ తమ్ముడు ఉన్నారు.

ఇదీ చదవండి: గవర్నర్​ను తొలగించాలని రాష్ట్రపతికి టీఎంసీ లేఖ

ABOUT THE AUTHOR

...view details