తెలంగాణ

telangana

By

Published : Feb 17, 2022, 1:04 PM IST

ETV Bharat / bharat

' 'ప్రైవేటు సంస్థల్లో 75% రిజర్వేషన్​'పై త్వరగా తేల్చండి'

75 Reservation in Private Jobs: ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ చట్టంపై హరియాణా హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు పక్కకు పెట్టింది. నెలరోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని హైకోర్టుకు సూచించింది.

Supreme Court
సుప్రీంకోర్టు

75 Reservation in Private Jobs: 'స్థానికులకే ఉద్యోగాలు' అనే అంశంపై హరియాణా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కకు పెట్టింది. నెలరోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని హైకోర్టుకు సూచించింది. ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే చెందాలని హరియాణా ప్రభుత్వం ఇటీవల ఓ చట్టం చేసింది. దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ పమిడిఘంటమ్ శ్రీ నరసింహతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు తాజాగా తీర్పు వెలువరించింది.

"నాలుగు వారాల గడువులోగా విచారణ జరిపేలా హైకోర్టును అభ్యర్థించాలని ప్రతిపాదిస్తున్నాం. మెరిట్ వ్యవహారంలో మేము కల్పించుకోవాలని భావించట్లేదు. ఎలాంటి వాయిదాలు లేకుండా ఇరుపక్షాలు కోర్టు ముందు హాజరు కావాలి. ఈ మధ్యలో ప్రైవేటు సంస్థల యజమానులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దు."

- సుప్రీంకోర్టు

ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే చెందాలనే చట్టాన్ని హైకోర్టు నిలుపుదల చేయడంపై హరియాణా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు విచారణ జరిపిన సుప్రీం తీర్పు వెలువరించింది.

ఇదీ చదవండి:'ఇష్టారీతి భూముల కేటాయింపును నిలిపేయాలి'

ABOUT THE AUTHOR

...view details