ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ.. వ్యాక్సిన్ బూస్టర్ డోసు(booster dose)పై చర్చలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన ఎయిమ్స్(AIIMS) సీనియర్ డాక్టర్.. టీకా మూడో డోసు అవసరమా? అన్న అంశంపై భారత్, అమెరికాతో పాటు ఇతర దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.
"భారత్లో టీకా కార్యక్రమం 5 నెలల క్రితం ప్రారంభమైంది. ప్రస్తతం.. ప్రజల ముందున్న ప్రశ్న బూస్టర్ డోసు తీసుకోవాలా? వద్దా? ప్రస్తుతం మూడో డోసు అవసరం పై పరిశోధనలు జరుగుతున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో ఈ విషయంపై స్పష్టత వస్తుంది."