ఉత్తరాఖండ్ జలప్రళయం తర్వాత కొనసాగుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకం ఎదురవుతుంది. వరదలో గల్లంతై.. తపోవన్ సొరంగంలో చిక్కుకున్నట్లు భావిస్తున్న వారిని రక్షించేందుకు చేపట్టిన డ్రిల్లింగ్ ఆపరేషన్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. తవ్వకాలు జరిపే యంత్రం చెడిపోవడం వల్ల తాత్కాలికంగా నిలిపివేసినట్లు రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. ఇతర ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
జలవిలయం కారణంగా ఇప్పటి వరకు 35 మంది మరణించగా.. 204 మంది గల్లంతయ్యారని ఆ రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది.