తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జల విలయం: 58కి చేరిన మృతుల సంఖ్య - ఉత్తరాఖండ్ 58కి చేరిన మృతుల సంఖ్య

ఉత్తరాఖండ్ జల విలయ ఘటనలో మరో 11 మృతదేహాలు లభ్యమయ్యాయి. చమోలీ జిల్లా జోషిమఠ్​లోని తపోవన్ సొరంగంలో ఈ మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 58కి చేరింది. మరో 146 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

rescue-operation-continues-at-raini-village-in-glacier-burst-of-chamoli-incident
ఉత్తరాఖండ్​ జలవిలయం: 58కి చేరిన మృతుల సంఖ్య

By

Published : Feb 16, 2021, 9:48 AM IST

ఉత్తరాఖండ్​ చమోలీ జిల్లాలో జరిగిన ప్రమాదంలో మరో 11 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీనితో మొత్తం మృతుల సంఖ్య 58కి చేరింది. మరో 146మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను జోషి మఠ్​లోని తపోవన్ సొరంగంలో గుర్తించినట్లు పేర్కొన్నారు. జాతీయ విపత్తు దళం, ఇండో టిబెటన్​ పోలీస్​తో కలిసి చమోలీ జిల్లాలో గాలింపు చర్యలు చేస్తున్నట్లు వివరించారు.

మృతదేహాలను బయటకు తీసుకొస్తున్న రెస్క్యూ సిబ్బంది

జోషిమఠ్ వద్ద నందాదేవి హిమానీనదం బద్దలవ్వడం వల్ల రిషిగంగ నదిలో ఆకస్మిక వరదలు సంభవించాయి. 13.2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్‌ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది. రిషి గంగా, ధౌలీ గంగా సంగమం వద్ద ఉన్న ఎన్​టీపీసీకి చెందిన మరో జల విద్యుత్‌ ప్రాజెక్టు పాక్షికంగా ధ్వంసమైంది.

ABOUT THE AUTHOR

...view details