ఉత్తరాఖండ్‌లో హిమానీనదం సృష్టించిన జలవిలయంలో మృతుల సంఖ్య 31కి చేరింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైనవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. భారీ యంత్రాలతో బురదమేటలను తొలగిస్తున్నారు. తపోవన్ విద్యుత్ కేంద్రం వద్ద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రెండో సొరంగంలో సహాయక చర్యలు నిరంతరాయంగా సాగుతున్నాయి. ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఉత్తరాఖండ్ పోలీసు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సొరంగంలో వందమీటర్ల వరకు శిథిలాలను తొలగించినట్లు తెలుస్తోంది.
సొరంగంలో చిక్కుకుపోయినవారిని బయటకు తీసుకొస్తున్న సిబ్బంది మరో 5 మృతదేహాలను గుర్తించినట్లు రాష్ట్ర ఎమర్జెన్సీ, కంట్రోల్ సెంటర్ తెలిపింది. బురద మేటలను తొలగించే కొద్దీ మరిన్ని శవాలు బయటపడుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సొరంగం లోపల సహాయ సిబ్బంది రాత్రివేళ కొనసాగుతున్న శిథిలాల తొలగింపు ప్రక్రియ సొరంగం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. మధ్యాహ్నం నాటికి సొరంగం నుంచి బురదను తొలగిస్తామని ఆశిస్తున్నట్లు చెప్పారు.
సహాయక చర్యల్లో భారీ యంత్రం హెలికాప్టర్ ఏరియల్ వ్యూ దృశ్యం మరోవైపు, సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని దెహ్రాదూన్ నుంచి జోషిమఠ్‌కు పంపించింది భారత వాయుసేన. ఎంఐ-17 హెలికాప్టర్లలో వీరిని తరలించినట్లు తెలిపింది.
హెలికాప్టర్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది జోషిమఠ్ చేరుకున్న హెలికాప్టర్ థర్మల్ ఇమాజింగ్ నిర్వహిస్తున్న హెలికాప్టర్ అధికారులతో ఉత్తరాఖండ్ సీఎం రావత్ స్థానికులకు భరోసా ఇస్తున్న సీఎం బురదలో కూరుకుపోయిన నిర్మాణం రెండో సొరంగం వద్ద సహాయక చర్యలు జోషిమఠ్ చేరుకున్న హెలికాప్టర్ నిర్మాణం వద్ద శిథిలాలను తొలగిస్తున్న యంత్రం ఇదీ చదవండి:మానవ తప్పిదాలతో పర్యావరణ ప్రతీకారం