తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రిపబ్లిక్​ డే' ముఖ్య అతిథిగా సురినామ్ అధ్యక్షుడు! - republic of suriname president for

భారత గణతంత్ర వేడుకలు 55 ఏళ్ల తర్వాత అతిథి లేకుండా జరగనున్నాయా? అంటే.. కాదనే సమాధానం వినిపిస్తోంది. ఈసారి ముఖ్య అతిథిగా రిపబ్లికన్ ఆఫ్​ సురినామ్ అధ్యక్షుడు విచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.

suriname president
భారత గణతంత్ర వేడుకలకు సురినామ్ అధ్యక్షుడు

By

Published : Jan 10, 2021, 8:06 PM IST

భారత గణతంత్ర వేడుకల ముఖ్య అతిథిగా రిపబ్లిక్ ఆఫ్ సురినామ్ అధ్యక్షుడు చంద్రిక పెర్సాద్‌ సంతోకి హాజరయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. కరోనా కారణంగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనను రద్దు చేసుకున్న నేపథ్యంలో భారత మూలాలున్న సురినామ్‌ అధ్యక్షుడు సంతోకి గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావచ్చని తెలిపాయి.

ఇటీవల నిర్వహించిన ప్రవాసీ భారతీయ దివస్‌ సదస్సులో సంతోకి అతిథిగా పాల్గొని ముఖ్య ప్రసంగం చేశారు. సురినామ్‌ అధ్యక్ష ఎన్నికల్లో 51 స్థానాల్లో 20 స్థానాలు కైవసం చేసుకొని ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ తరపున అధ్యక్షుడిగా సంతోకి 2020 జులైలో ప్రమాణ స్వీకారం చేశారు. సురినామ్ దేశంలో భారతీయ సంతతికి చెందినవారు 5 లక్షల 87 వేల మంది ఉండగా.. అక్కడి జనాభాలో వారి వాటా 27.4 శాతం.

ఇదీ చూడండి:కొవిడ్ బాధితుల్లో కోమా, మతిమరుపు సమస్యలు

ABOUT THE AUTHOR

...view details