Republic Day 2024 Chief Guest : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఏడాది జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌నుఆహ్వానించారు. ఈ మేరకు భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి బుధవారం ప్రకటించారు. సెప్టెంబర్ 8న జీ-20 సదస్సులో భాగంగా ఇరుదేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రధాని మోదీ.. బైడెన్‌ను ఆహ్వానించినట్లు చెప్పారు. అదే సమయంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ సభ్యులుగా ఉన్న క్వాడ్ సమావేశం జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం నిరాకరించారు.
గణతంత్ర దినోత్సవాలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్.. ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది గణతంత్ర వేడుకలకు భారత్ ప్రపంచ దేశాధినేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తోంది. ప్రధాని మోదీ ఆహ్వానాన్ని బైడెన్ అంగీకరిస్తేగణతంత్ర ఉత్సవాలకు అతిథిగా విచ్చేసిన రెండో అమెరికా అధ్యక్షుడిగా నిలుస్తారు.
Modi Biden Bilateral Talks : ఇటీవల దిల్లీ వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భారత్‌కు వచ్చిన ఆయన.. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లారు. అక్కడ బైడెన్‌కు మోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నేతలిద్దరూ పలు అంశాలపై చర్చించారు. బైడెన్‌తో భేటీతో ఫలప్రదంగా జరిగిందని.. భారత్- అమెరికా ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచే అనేక అంశాలపై చర్చించినట్లు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు మోదీ. రెండు దేశాల మధ్య స్నేహం ప్రపంచానికి మేలు చేసేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.