Republic day 2022 ITBP: దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశం కోసం సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికులు సైతం ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. ఎముకలు కొరికే చలిలో, ఆక్సిజన్ అందనంత ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ITBP flag hoisting ladakh
లద్దాఖ్‌లో మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఇండోటిబెటన్ సరిహద్దు పోలీసు(ఐటీపీబీ) దళాలు గణతంత్ర వేడుకలు నిర్వహించాయి. 15 వేల అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాయి.
ITBP skating republic day
హిమవీరులుగా పిలిచే ఐటీబీపీ దళాలు ఉత్తరాఖండ్ ఔలీలో రిపబ్లిక్ వేడుకలు నిర్వహించాయి. మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 11 వేల అడుగుల ఎత్తులో స్కేటింగ్ చేస్తూ ఔరా అనిపించాయి.