తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పిల్లలకు ఆ టీకాలు అందలేదా?- అది అవాస్తవం' - universal immunization progaramme

దేశంలో కొవిడ్ పరిస్థితుల కారణంగా పిల్లలకు సాధారణ, క్రమానుగత టీకాలు అందలేదన్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్రం తెలిపింది. తాము కరోనా భయాల్ని తొలగించి, పిల్లలు టీకా తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిసి పని చేశామని స్పష్టం చేసింది.

vaccine for kids
పిల్లలకు టీకా

By

Published : Jul 17, 2021, 10:10 AM IST

కొవిడ్​ పరిస్థితుల కారణంగా భారత్​లో చాలా మంది పిల్లలకు సాధారణ, క్రమానుగత టీకాలు అందలేదన్న వార్తలపై కేంద్రం స్పందించింది. పిల్లలకు టీకా అందించే విషయంలో కరోనా భయాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో తాము కలిసి పనిచేశామని స్పష్టం చేసింది. యూనివర్సల్​ ఇమ్యునైజేషన్ ప్రొగ్రామ్ కింద అందరూ టీకా తీసుకునేలా కార్యక్రమాలు చేపట్టామని పేర్కొంది. భారత్​లో 35 లక్షల మందికి సాధారణ, క్రమానుగత టీకాలు అందలేదని యూనిసెఫ్​ వెల్లడించిన ఒక్కరోజు తర్వాత కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం.

"ఈ నివేదికల్లో ఎలాంటి ఆధారాలు లేవు. వాస్తవాలేంటో వీటిలో కనపడట్లేదు. మహమ్మారి వ్యాప్తి మొదలైన నాటి నుంచి యూనివర్సల్​ ఇమ్యునైజేషన్​ ప్రొగ్రామ్ సహా అత్యవసర సేవలను అందించడంలో మేం దృష్టి సారించాం. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, అభివృద్ధి భాగస్వాములతో కలిసి కొవిడ్​ భయాలను తొలగించి, పిల్లలు తప్పనిసరిగా టీకా తీసుకునేలా కార్యక్రమాలు చేపట్టాం."

-కేంద్ర ఆరోగ్య శాఖ

ప్రభుత్వ దృఢ నిశ్చయం, ప్రజా ఆరోగ్య విభాగం కార్యకర్తల సాయంతో.. దేశంలో 99శాతం మేర డీటీపీ3 టీకాను ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో తాము అందజేశామని కేంద్రం చెప్పింది. ఇప్పటివరకు డీటీపీ3 టీకా పంపిణీలో ఇదే అత్యధికం అని చెప్పింది.

2019 నాటికి దేశంలో క్రమానుగత టీకాలు అందని పిల్లల సంఖ్య 21 లక్షలుగా ఉండగా.. కరోనా అంతరాయాల కారణంగా అ సంఖ్య 35 లక్షలకు పెరిగిందని యూనిసెఫ్​ గురువారం తెలిపింది. ఈ విషయంలో భారత్​ తర్వాత స్థానంలో పాకిస్థాన్ ఉందని చెప్పింది. అక్కడ 13 లక్షల మంది పిల్లలకు గత ఏడాది ఎలాంటి టీకా అందలేదని వెల్లడించింది.

ఇదీ చూడండి:కరోనా పంజా - ఆ దేశాల్లో మళ్లీ ఆంక్షలు

ఇదీ చూడండి:'ఆ జిల్లాల్లో తీవ్ర స్థాయిలో కరోనా వ్యాప్తి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details