తెలంగాణ

telangana

వీధి కుక్కల 'జనాభా లెక్కలు'.. దేశంలో ఎన్ని ఉన్నాయంటే...

By

Published : Nov 26, 2021, 7:15 PM IST

ఇంటి నుంచి బయటకు వస్తే.. రోడ్డు మీద ఎన్నో వీధి శునకాలు(street dogs in india), పిల్లులు దర్శనమిస్తుంటాయి. ఇది సర్వసాధారణమైన విషయం. అసలు ఇంతకీ దేశంలో ఎన్ని వీధి కుక్కలు, పిల్లులు ఉన్నాయి?(street cats for adoption)

no of street dogs in india
దేశంలో వీధి కుక్కల సంఖ్య

number of street dogs in india: దేశవ్యాప్తంగా సుమారు 6.2కోట్ల వీధి శునకాలు, 91లక్షల వీధి పిల్లులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఓ​ నివేదిక వెల్లడించింది.

'ది స్టేట్​ ఆఫ్​ పెట్​ హోమ్​లెస్​నెస్​ ఇండెక్స్' ప్రకారం.. దాదాపు 68శాతం జనాభాకు(ప్రతి 10మందిలో ఏడుగురు) వీధి పిల్లులు వారానికోసారి కనిపిస్తున్నాయి. ఇక కుక్కలను తరచూ చూస్తున్నట్టు 77శాతం జనాభా(ప్రతి 10మందిలో ఎనిమిది) పేర్కొంది. వీధి కుక్కులు, పిల్లుల సంఖ్య పెరుగుతోంది అంటే.. 'ఆల్​ పెట్స్​​ వాంటెడ్​(జంతువుల పెంపకం)' డేటాలో భారత్​ స్కోరు పడిపోతోందని అర్థం.

నివేదిక​లోని మరిన్ని వివరాలు...

  • దేశవ్యాప్తంగా దాదాపు 8కోట్ల కుక్కలు, పిల్లులకు నివాసాలు లేవు. షెల్టర్​ హోమ్స్​లో 88లక్షల శునకాలు, పిల్లులు ఉన్నాయి.
  • వికలాంగులకు సహాయం చేయడంలో ఎలాంటి శిక్షణ లేని జంతువులు(కంపానియన్​ యానిమల్స్​) 85శాతం ఉన్నాయి.
  • భవిష్యత్తులో జంతువులను పెంచుకోవడానికి సముఖంగా ఉన్న ప్రజల సంఖ్య పెరుగుతోంది. దీంతో దేశ 'ఆల్​ పెట్స్​ కేర్డ్​ ఫర్​(జంతువుల సంరక్షణ)' స్కోరు పెరిగింది(street cats for adoption).
  • దూరం ఎక్కువగా ఉందని, పరువు పోతుందని, మౌలిక వసతులు లేవని.. పెట్స్​ను పెంచుకునే వారిలో 61శాతం మంది పశు వైద్యశాలను సందర్శించడం లేదు. అంతర్జాతీయ సగటు(31) కన్నా ఇది చాలా ఎక్కువ. దీంతో ఆల్​ పెట్స్​ కేర్డ్​ ఫర్​ స్కోరు పడిపోయింది.

నివాసం లేని పిల్లులు, కుక్కలు.. చైనాలో 7.5కోట్లు, అమెరికాలో 4.8కోట్లు, జర్మనీలో 20.6లక్షలు, గ్రీస్​లో 20లక్షలు, మెక్సికోలో 74లక్షలు, రష్యా- దక్షిణాఫ్రికాలో 41లక్షలు, బ్రిటన్​లో 11లక్షలు ఉన్నాయి.

ఇవీ చూడండి:-

Dog Monkey Friendship: ముస్తఫా ముస్తఫా.. మాకు జాతి వైరం లేదు ముస్తఫా

ఈ శునకం కీపరా?.. ఆల్​రౌండరా?.. సచిన్ వీడియో వైరల్

ABOUT THE AUTHOR

...view details