తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కుల ధ్రువీకరణపై పదేపదే విచారణ హానికరం' - కులధ్రువీకరణ పత్రాల రద్దు

కుల ధ్రువీకరణ పత్రాల విచారణలపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వీటిపై పదేపదే విచారణలు జరపడం ఎస్​సీ,ఎస్​టీలకు హానికరమని తెలిపింది.

supreme court
సుప్రీంకోర్టు

By

Published : Sep 3, 2021, 4:34 AM IST

Updated : Sep 3, 2021, 7:12 AM IST

కులధ్రువీకరణ పత్రాలపై పదేపదే విచారణలు ఎస్​సీ, ఎస్​టీలకు హానికరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అభ్యర్థులు మోసపూరితంగా వ్యవహరించినపుడు, తగిన విచారణ జరపకుండానే ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినపుడు మాత్రమే వీటిపై విచారణను పునఃప్రారంభించాలని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.

జిల్లా విజిలెన్స్‌ కమిటీ తన కులధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ తమిళనాడుకు చెందిన మహిళ చేసిన అప్పీలుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 1982లో ఇచ్చిన కులధ్రువీకరణ పత్రంపై విచారణ జరిపిన జిల్లా విజిలెన్స్‌ కమిటీ 1999లో ఎస్సీగా ధ్రువీకరించి 2001లో ఆమె ప్రభుత్వోద్యోగంలో అదే పత్రంపై వచ్చిన ఫిర్యాదుతో మరోసారి విచారణ జరిపి రద్దుచేసింది.

దీంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించగా... పిటిషన్‌ను కొట్టివేయడంతో సుప్రీంలో అప్పీలు చేశారు. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు కేసులను తిరగదోడే అధికారాన్ని రాష్ట్రస్థాయి స్క్రూటినీ కమిటీకి ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపింది. అందువల్ల రెండోసారి విచారణ జరిపాలని జిల్లా స్థాయి విజిలెన్స్‌ కమిటీని ఆదేశించే న్యాయ పరిధి రాష్ట్ర కమిటీకి లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.

ఇదీ చూడండి:కుమార్తె పెళ్లిలో స్టెప్పులేసిన కేంద్ర మంత్రి

Last Updated : Sep 3, 2021, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details