ఎలాంటి చర్చ చేపట్టకుండా సాగు చట్టాలను రద్దు(farm laws repeal) చేయటం ప్రభుత్వం భయపడుతోందనేందుకు నిదర్శనమని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi news). తప్పు చేశారని అర్థమవుతోందని విమర్శించారు.
నూతన సాగు చట్టాల రద్దు బిల్లుకు(The Farm Laws Repeal Bill 2021) పార్లమెంట్ ఆమోదం తెలిపిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. సాగు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని కాంగ్రెస్ ముందే అంచనా వేసిందన్నారు. 3-4 క్యాప్టలిస్టుల శక్తి, రైతులు, కార్మికుల బలం ముందు నిలబడలేదని ఎద్దేవా చేశారు.
"సాగు చట్టాల రద్దు రైతులు, దేశ ప్రజల విజయం. ఇక్కడ బిల్లులను ఎలాంటి చర్చలు, సంప్రదింపులు లేకుండా ఏ విధంగా రద్దు చేశారనేదే దురదృష్టకరం. ఈ బిల్లుల వెనుక ఉన్న శక్తుల గురించి చర్చించాలనుకుంటున్నాం. ఈ బిల్లులు ప్రధాని అభిప్రాయాన్ని మాత్రమే ప్రతిబింబించటం లేదు, ఆయన వెనకున్న శక్తులను ప్రతిబింబిస్తున్నాయి. అందుకే చర్చించాలంటున్నాం. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
కనీస మద్దతు ధర, లఖింపుర్ ఖేరి హింస(Lakhimpur kheri violence), సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో(Farmers protest) ప్రాణాలు కోల్పోయిన 700 మంది రైతుల అంశంపై మాట్లాడాలనుకుంటున్నామని, దురదృష్టవశాత్తు అందుకు అవకాశం ఇవ్వటం లేదన్నారు రాహుల్. ఈ అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ భయపడుతోందనే నిజాన్ని ప్రతిబింబిస్తోందని ఆరోపించారు. చర్చలు జరగనప్పుడు పార్లమెంట్ ముఖ్య ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
పార్లమెంట్లో సాగు చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం ఇలా..
పార్లమెంట్ శీతాకాల సమావేశాల(parliament winter sessions) తొలిరోజునే విపక్షాల ఆందోళనలతో గందరగోళం ఏర్పడింది. లోక్‌సభ ఓసారి వాయిదాపడి తిరిగి ప్రారంభంకాగానే.. కొత్త సాగు చట్టాల రద్దు బిల్లును(The Farm Laws Repeal Bill 2021) ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. బిల్లుపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వారి డిమాండ్‌ను తిరస్కరించిన స్పీకర్ ఓం బిర్లా.. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపారు.
రాజ్యసభలో మధ్యాహ్నం లంచ్ తర్వాత సాగు చట్టాల రద్దు(Farm laws repealed news) బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. దీనిపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అందుకు అంగీకరించకపోవటం వల్ల ఆందోళనకు చేపట్టాయి. విపక్షాల నిరసనల మధ్యే మూజువాణి ఓటు ద్వారా బిల్లుకు ఆమోదం తెలిపారు వైస్ ఛైర్మన్.
ఇదీ చూడండి:'సాగు చట్టాల రద్దు' బిల్లుకు పార్లమెంట్ ఆమోదం