తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ లోయలో తెరపైకి కొత్త ఉగ్ర సంస్థలు

ఆర్టికల్​ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయని పలు నివేదికుల చెబుతున్నాయి. అయితే.. హిజ్బుల్​ ముజాహిద్దీన్​, లష్కరే తోయిబా, జైషే వంటి వాటి స్థానంలో కొత్త మిలిటెంట్​ గ్రూప్​లు వెలుగులోకి వచ్చాయి. అవి స్థానికంగా ఏర్పడినవేనని, పాక్​ హస్తం లేదని చూపేందుకు ప్రయత్నిస్తున్నాయని, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

militant outfits
కశ్మీర్​ లోయలో తెరపైకి కొత్త ఉగ్ర సంస్థలు

By

Published : Aug 5, 2021, 4:57 PM IST

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370ని.. 2019, ఆగస్టు 5న రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. తద్వారా కేంద్ర చట్టాలు ఆ ప్రాంతంలో అమలవటమే కాక.. కశ్మీర్​ లోయలోని ఉగ్రవాద సంస్థల్లో కూడా మార్పులు జరిగాయి. హిజ్బుల్​ ముజాహిద్దీన్​, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్​ వంటి వాటి ప్రాబల్యం తగ్గింది. కానీ, ద రెసిస్టన్స్​ ఫ్రంట్​ (టీఆర్​ఎఫ్​), పీపుల్స్​ యాంటీ ఫాసిస్ట్​ ఫ్రంట్​ (పీఏఎఫ్​ఎఫ్​) వంటివి వెలుగులోకి వచ్చాయి. అయితే.. తాము ఇతర గ్రూపు​లతో సంబంధాలు నెరపటం లేదని కొత్త ఉగ్ర ముఠాలు అంటున్నా.. అందులోని కొందరికి పాత గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

ఈ అంశంపై జమ్ముకశ్మీర్​ సీనియర్​ పోలీసు అధికారి విజయ్​​ కుమార్ ఈటీవీ భారత్​కు​ కీలక విషయాలు వెల్లడించారు.

"కశ్మీర్​లో స్థానిక ఉగ్రవాదులు మాత్రమే పనిచేస్తున్నారని, అందులో పాకిస్థాన్​ హస్తం లేదని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించాలనుకుంటున్నారు. అయితే, అది వాస్తవానికి విరుద్ధంగా ఉంది. తొలిసారి ఇస్లామ్​ ప్రభావం లేకుండా మిలిటెంట్​ ఆర్గనైజేషన్స్​ పేర్లు బయటకు వచ్చాయి. అంతకు ముందు జమ్ముకశ్మీర్​ లిబరేషన్​ ఫ్రంట్​ పేరు ఒక్కటే ఇస్లాంకు సంబంధం లేకుండా ఉండేది. ముందు.. టీఆర్​ఎఫ్​, పీఏఎఫ్​ఎఫ్​లను భద్రతా బలగాలు అంతగా తీవ్రంగా పరిగణించలేదు. కానీ, దాడులకు బాధ్యత వహిస్తూ.. సోషల్​ నెట్​వర్కింగ్​ సైట్స్​, పబ్లిక్​ ప్లాట్​ఫామ్స్​పై తరుచుగా ప్రకటించుకుంటున్న క్రమంలో దర్యాప్తు చేపట్టాల్సి వచ్చింది. బలగాలతో జరిగిన కాల్పుల్లో మరణించిన వారి గుర్తింపు ప్రకారం వారు హిజ్బుల్​ ముజాహిద్దీన్​, లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. వారు సంస్థకు స్థానిక రంగును ఇచ్చేందుకు తరచుగా సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. "

- విజయ్​ కుమార్​, ఐజీపీ కశ్మీర్​.

బుర్హాన్​ వాణీ సోషల్​ మీడియా వినియోగం, ఈ కొత్త ముఠాలకు తేడా ఏంటి?

ఓ ఉగ్రవాదిని వారు హీరో చేయాలనుకుంటున్నారు. కానీ, అలాంటి వ్యక్తి కనిపించటం లేదు. అందుకు తమ సంస్థనే హీరోగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే కశ్మీర్​లోని ఉగ్రవాదం దేశీయంగా తయారైందేనని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నారు. ఈ ఏడాది కశ్మీర్​ లోయలో 90 మంది ఉగ్రవాదులు మరణిస్తే.. అందులో 51 మంది లష్కరే తోయిబా, 20 మంది హిజ్బుల్​, 8 మంది జైషే, ముగ్గురు ఆల్​ బద్రా, ఇతరులు గజ్వాత్​ ఉల్​ హింద్​, హిస్లామిక్​ స్టేట్​కు చెందినవారు ఉన్నారు. అందులో 13 మంది వరకు పాకిస్థానీలు కూడా ఉన్నారు.

టీఆర్​ఎఫ్​పై ఏమంటారు?

2019, ఆగస్టు 5 తర్వాత సమాచార వ్యవస్థ మూసివేశారు. దాంతో పాకిస్థాన్​ టీఆర్​ఎఫ్​, పీఏఎఫ్​ఎఫ్​ ఉగ్రవాద గ్రూపులను ప్రారంభించేందుకు ప్రణాళిక రచించింది. వారు 2020, ఫిబ్రవరిలో బయటకు వచ్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో శ్రీనగర్​లోని లాల్​చౌక్​లో గ్రెనేడ్​ దాడి జరిగింది. ఇద్దరు సీఆర్​పీఎఫ్​ సిబ్బంది, నలుగురు పౌరులు గాయపడ్డారు. ఈ దాడికి కారణం లష్కరేలోని కొత్త వారని ప్రాథమిక విచారణలో తేలింది. అది ఆర్టికల్​ 370 రద్దుకు ప్రతీకారంగా చేశారు. ఆ తర్వాత ఏప్రిల్​లో కుప్వారా కెరన్​ సెక్టార్​లో అదే మిలిటెంట్​ గ్రూప్​ ఐదుగురు భారత సైనికులను కాల్చి చంపింది. ఆ కాల్పుల్లో ఉగ్రవాదులు సైతం హతమయ్యారు. అప్పటి నుంచి రాజకీయ నాయకులు, పోలీసులు, పౌరులను పొట్టనపెట్టుకుంటున్నారు.

కొద్ది రోజుల క్రితం.. కశ్మీర్​ లోయలో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాదుల జాబితాను విడుదల చేశారు పోలీసులు. అందులో సలీమ్​ పారే, యూసఫ్​ కాంత్రూ, అబ్బాస్​ షేక్​, రియాజ్​ షెటర్​గుండ్​, ఫరూక్​ నాలి, జుబెయిర్​ వాణీ, మౌల్వీ అష్రఫ్​ ఖాన్​ వంటి కీలక వ్యక్తుల పేర్లు ఉన్నాయి.

ఇదీ చూడండి:Hybrid militants: భద్రతా దళాలకు సరికొత్త సవాలు!

ఉగ్రవాదుల ఏరివేత- 98మంది హతం!

ABOUT THE AUTHOR

...view details