బంగాల్ నాలుగో విడత పోలింగ్ రోజున జరిగిన కూచ్‌బిహార్ కాల్పుల ఘటనను 'మారణహోమం' అని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. నిజాలను దాచిపెట్టేందుకే కూచ్బిహార్లో 72 గంటల పాటు రాజకీయ నాయకుల ప్రవేశంపై ఈసీ నిషేధం విధించిందని ఆరోపించారు. సిలిగుడిలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
"సీతల్‌కుచి ప్రాంతంలో నాలుగో విడత పోలింగ్ జరుగుతున్న వేళ.. బాధితుల మొండాలను గురి చూసి కేంద్ర బలాగాలు కాల్పులు జరిపాయి. ఇది మారణహోమమే. సీతల్‌కుచి ప్రాంతాన్ని ఏప్రిల్ 14న సందర్శించాలనుకుంటున్నాను. మనకో అసమర్థ హోం మంత్రి, అసమర్థ కేంద్ర ప్రభుత్వం ఉంది. పరిస్థితులను ఎలా చక్కదిద్దాలో సీఐఎస్ఎఫ్ బలగాలకు తెలియదు. కేంద్ర బలగాల్లోని కొంత మంది ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారనే విషయం మొదటి దశ పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నాను. నందిగ్రామ్‌లో ఈ విషయం చెప్పినప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు. "
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
శనివారం జరిగిన కాల్పుల్లో మృతిచెందిన నలుగురు వ్యక్తుల కుటుంబాలతో మమత ఫోన్లో మాట్లాడారు. ఏప్రిల్ 14న వారిని పరామర్శించేందుకు వస్తానని హామీ ఇచ్చారు.
'మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్' గా మార్చండి'