తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాహుల్​ ట్విట్టర్​ ఖాతాను అందుకే లాక్​ చేశాం​'

తమ పాలసీకి వ్యతిరేకంగా ఉండటం వల్లే కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఖాతాను లాక్​ చేసినట్లు ట్విట్టర్..​ దిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. దళిత బాలిక హత్యాచారం కేసుకు సంబంధించి రాహుల్​ ట్వీట్​పై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్​పై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ట్విట్టర్​ను కోర్టు ప్రశ్నించింది.

Rahul Gandhi tweet controversy
'రాహుల్​ ట్విట్టర్​ ఖాతాను అందుకే లాక్​ చేశాము​'

By

Published : Aug 12, 2021, 12:05 AM IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ ఖాతాను లాక్‌ చేసినట్లు ట్విట్టర్‌.. దిల్లీ హైకోర్టుకు తెలిపింది. దిల్లీలోని దళిత బాలిక హత్యాచారం కేసులో బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలు బయటి ప్రపంచానికి తెలిసేలా ట్వీట్‌ చేసిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ట్విటర్‌ ఈ విషయాన్ని కోర్టుకు వెల్లడించింది.

తమ పాలసీకి వ్యతిరేకంగా ఉండటం వల్లే రాహుల్‌ ట్వీట్‌ను తొలగించడం సహా ఆయన ట్విట్టర్‌ ఖాతాను సైతం లాక్‌ చేసినట్లు తెలిపిన ట్విట్టర్‌.. ఇందులోకి తమను అనవసరంగా పిటిషనర్‌ లాగారని కోర్టుకు తెలిపింది. మరోవైపు ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్‌ 27కు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ జ్యోతి సింగ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఇదీ చదవండి :మరో 3 ప్రాంతాల్లో సుప్రీం కోర్టు బెంచ్​లు- నిజమేనా?

ABOUT THE AUTHOR

...view details