ఒకవైపు చాలా రాష్ట్రాల్లో కొవిడ్ చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్ కొరత ఉండగా.. కొందరు మాత్రం దీన్ని యథేచ్చగా.. ఏకంగా ఓఎల్‌ఎక్స్‌లో పెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గుజరాత్, మహారాష్ట్రకు చెందిన పలువురు ఓఎల్‌ఎక్స్ యూజర్లు ఈ ఇంజెక్షన్లను వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టారు. ఒక్కో వయల్‌ను గరిష్ఠంగా రూ.6వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:జూన్ నాటికి రోజుకు 2,320 కరోనా మరణాలు!
సాధారణంగా.. ఓఎల్‌ఎక్స్‌లో ఎలాంటి మెడిసిన్ల అమ్మకానికి అనుమతిలేదు. అలాంటిది కొవిడ్ చికిత్సలో అత్యంత కీలకంగా మారిన రెమ్‌డెసివిర్‌ను ఈ వెబ్‌సైట్లో విక్రయిస్తుండటం కలకలం రేపుతోంది. ఇంజెక్షన్ల కొరత అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌లోని బ్లాక్ మార్కెట్‌లో వీటి అమ్మకాలు జోరుగా సాగుతుండటం గమనార్హం. అంతేకాకుండా.. వీటికి మరింత డిమాండ్ పెరుగుతున్నందున.. కొందరు నకిలీ ఇంజెక్షన్లను కూడా విక్రయిస్తున్నారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ఈ ఔషధ ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది.
ఇదీ చదవండి:భాజపా వల్లే బంగాల్లో కరోనా వ్యాప్తి: దీదీ