బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా రావాలని రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా ముఖేశ్ అంబానీకి ఆహ్వానం వచ్చిందన్న వార్తల్లో నిజం లేదని రిలయన్స్ గ్రూప్ వెల్లడించింది. తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధికార ప్రతినిధి తెలిపారు.
'నీతా అంబానీపై వస్తున్న ఆ వార్తలు అవాస్తవం' - రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీని విజిటింగ్ ప్రొఫెసర్‌గా రావాలని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆహ్వానం పంపిందన్న వార్తలు నిజం కావని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. తమకు అసలు అలాంటి ప్రతిపాదనేదీ రాలేదని వెల్లడించింది.

'నీతా అంబానీపై వస్తున్న ఆ వార్తలు నిజం కావు'
నీతా అంబానీని విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఆహ్వానించాలని యాజమాన్యానికి ప్రతిపాదన పంపించామని ప్రొ. నిధి శర్మ తెలిపినట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఆ ప్రతిపాదనను బీహెచ్‌యూ విద్యార్థులు వ్యతిరేకించారు. ఈ మేరకు బీహెచ్‌యూలో మంగళవారం ఆందోళనలు చేపట్టారు. నీతా అంబానీకి బదులుగా.. మహిళా సాధికారతకు ఉదాహరణగా నిలిచిన వేరొకరిని ఆహ్వానించాలని డిమాండ్ చేశామని విద్యార్థి సంఘం నేత శుభం తివారీ అన్నారు.
ఇదీ చదవండి:'మహిళా సాధికారత కోసం 'హెర్ సర్కిల్''