తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోవిల్​పట్టు నుంచి ఎన్నికల బరిలో దినకరన్​ - తమిళనాడు శాసనసభ ఎన్నికలు

తమిళనాడు శాసనసభ ఎన్నికలకు 50మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది అమ్మ మక్కల్​​ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) పార్టీ. శశికళ మేనల్లుడు, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్​.. కోవిల్​ పట్టు నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారు.

release-of-the-second-list-of-ammk-candidates
ఏఎంఎంకే అభ్యర్థుల రెండో జాబితా విడుదల

By

Published : Mar 11, 2021, 8:22 PM IST

జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్​.. కోవిల్​పట్టు అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అదే స్థానం నుంచి జయలలిత పార్టీ.. అన్నాడీఎంకే అభ్యర్థి , మంత్రి కాదంబర్​ రాజు పోటీపడుతున్నారు. దాంతో అందరి దృష్టి కోవిల్​పట్టుపైనే ఉంది.

అమ్మ మక్కల్​​ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) పార్టీ 50 మందితో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. కాగా అన్నాడీఎంకే అభ్యర్థి కాదంబర్​ రాజు కోవిల్​ పట్టు నియోజక వర్గం నుంచి వరుసగా రెండు సార్లు(2011, 2016) గెలిచారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన రాధాకృష్ణ నగర్​కు 2017లో ఉపఎన్నిక జరగగా దినకరన్​​ ఆ స్థానంలో గెలుపొందారు.

15మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను ఏఎంఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్ మార్చి 10వ తేదీన వెల్లడించారు. మామాజీ ఎమ్మెల్యే పీ పలనిప్పన్​, ఎమ్​. రంగస్వామి, జీ.సెంతమిళన్​, సీ షణ్ముగవేలు, ఎన్​జీ పార్థిబాన్​లు ఆ జాబితాలో ఉన్న ప్రముఖులు.

రాష్ట్రంలో 234 సీట్లకు ఏప్రిల్​ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి:దినకరన్​​ కలలు నెరవేరవు: పళనిస్వామి

ABOUT THE AUTHOR

...view details