Relaxing COVID-19 restrictions: దిల్లీలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కొవిడ్ ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించింది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం. నైట్ కర్ఫ్యూ మాత్రం కొనసాగుతుందని, రాత్రి 10కి బదులు.. 11 గంటలకు మొదలవుతుందని స్పష్టం చేసింది.
- నర్సరీ నుంచి అన్ని తరగతుల విద్యార్థుల కోసం పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. టీచర్లు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలి.
- కార్లలో ఒంటరిగా ప్రయాణించే వారు మాస్కు ధరించాల్సిన అవసరం లేదు.
- ఆఫీసుల్లో 100 శాతం హాజరుకు అనుమతి.
దిల్లీలో జనవరి 13న రికార్డుస్థాయిలో 28 వేల 867 కరోనా కేసులు నమోదయ్యాయి. తర్వాత 10 రోజుల్లోనే రోజువారీ కేసులు 10 వేల దిగువకు చేరాయి.
నైట్ కర్ఫ్యూ ఎత్తివేత..
కొవిడ్-19 ఆంక్షలను సడలించిన రాజస్థాన్ ప్రభుత్వం.. నైట్ కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
- ఇండోర్, బహిరంగ సమావేశాలకు గరిష్ఠంగా 250 మందికి అనుమతి కల్పిస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 5న కొత్త రూల్స్ అమలవుతాయని స్పష్టం చేసింది.
- మతపరమైన ప్రదేశాల్లో గతంలో మాదిరిగానే.. భక్తులకు అనుమతి కల్పిస్తున్నట్లు తెలిపింది.
Theatres, gyms, yoga centres allowed
కేసులు తగ్గుతున్న క్రమంలో ఆంక్షలను సడలించిన కర్ణాటక ప్రభుత్వం.. తాజాగా మరిన్ని మినహాయింపులు ఇచ్చింది.
థియేటర్లు, జిమ్‌లు, యోగా కేంద్రాలు, స్విమ్మింగ్ పూల్స్.. పూర్తి సామర్థ్యంతో నడుపుకోవచ్చని స్పష్టం చేసింది. ఆరోగ్య మంత్రి సహా ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం.. సీఎం బసవరాజ్ బొమ్మై ఈ నిర్ణయం తీసుకున్నారు.