మావోయిస్టుల వద్ద బందీగా ఉన్న సీఆర్పీఎఫ్ జవాను రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌ను సురక్షితంగా కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ ఆయన బంధువులు నిరసన చేపట్టారు. జవాను స్వస్థలం జమ్ముకశ్మీర్ బర్నాయ్‌లో.. ఆందోళన చేపట్టారు.
రాకేశ్వర్ సింగ్‌ను.. మావోల చెరనుంచి విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని బంధువులు ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన భర్తను కాపాడాలని జవాన్ రాకేశ్వర్ భార్య మీనూ.. ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:'నక్సలిజంపై విజయం తథ్యం'
ఇదీ చదవండి:అమిత్ షా, యోగిని చంపుతామని బెదిరింపు మెయిల్
"నా భర్త మావోయిస్టుల చెరలో ఉన్నాడు. అతన్ని వెంటనే విడుదల చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. దశాబ్దం నుంచి దేశం కోసం అతను పోరాడుతున్నారు. ఇప్పుడు దేశం అతన్ని విడుదల చేయడం కోసం పోరాడాలి."
-జవాను రాకేశ్వర్ భార్య మీనూ
రాకేశ్వర్ సింగ్ మన్హాస్ కూతురు ఒకటో తరగతి చదువుతోంది. ఆ చిన్నారి కూడా తన తండ్రిని విడిపించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది.