Relationship Issues : మీకు వివాహం జరిగి 21 ఏళ్లవుతోందని తెలిపారు. కానీ గత కొన్ని రోజులుగా మీ భర్త మరొక మహిళతో ఫోన్ కాల్స్ మాట్లాడడం, చాటింగ్ చేయడం మీరు గమనించారని పేర్కొన్నారు. అయితే అప్పటినుంచి మీలో ఏదో తెలియని సందిగ్ధత నెలకొందని తెలుస్తోంది. అయితే సదరు మహిళ.. పెండ్లికి ముందు మీ భర్త గర్ల్‌ఫ్రెండ్ కావడం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుందని అర్థమవుతోంది. అయితే ఇప్పటికే ఈ విషయం గురించి మీ భర్తతో చర్చించానని చెబుతున్నారు.
- 'మీ భాగస్వామితో మాటల్లేవా.. ఇలా చేస్తే మళ్లీ దగ్గరైపోతారు'
Experts Advice on Relationship Issues :కానీ మీ భర్త మాత్రం తను కేవలం స్నేహితురాలు మాత్రమేనని మీకు జవాబు ఇచ్చారు. ఆ ఇచ్చిన సమాధానం మీకు సంతృప్తి కలిగించలేదని అర్థమవుతోంది. మరోవైపు వాట్సప్‌లో లవ్ స్టిక్కర్లు పంపించుకోవడం వల్ల మీకు ఉన్న అనుమానాలకు మరిన్ని సందేహాలు కలిగించే ప్రయత్నం చేశాయి. కానీ కొన్ని సందర్భాలలో జీవిత భాగస్వామి చేసే మోసం కంటే.. దానికి సంబంధించిన అనుమానాలు ఎక్కువగా కుంగుబాటుకు గురిచేస్తాయి. అవి ఇన్నేళ్ల మీ వివాహ బంధంలో కూడగట్టుకున్న నమ్మకాన్ని, విధేయతను కూడా ప్రశ్నించేలా చేస్తున్నాయి. కాబట్టి, అలాంటి ఆలోచనలకు వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.
మరోవైపు మీ దాంపత్య బంధం గత 20 సంవత్సరాలుగా సాఫీగా సాగిందని మీరు పేర్కొన్నారు. ఈ మధ్యలోనే మీ మధ్య విభేదాలు తలెత్తాయని తెలిపారు. కావున మరోసారి మీ భర్తతో ఆ అంశాలను సానుకూల వాతావరణంలో చర్చించే ప్రయత్నం చేయండి. ఇందులో భాగంగానే మీ అభిప్రాయాలు, సందేహాలను అతనితో పంచుకొని.. వాటిని నివృత్తి చేసుకోండి. ఈ క్రమంలోనే అలాగే మరో మహిళతో మీ భర్త ఫోన్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల.. మీరు పడుతున్న మానసిక వేదనను అతనికి వివరించే ప్రయత్నం చేయండి. తద్వారా వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.
మీ భర్త మీపై ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు. అయితే మీ ఇరువురి మధ్య దూరం పెరగడానికి.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని కూడా పరిశీలించండి. అలాగే మీ భర్త తన మాజీ ప్రేయసితో ఫోన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే అతని ఆలోచనలను మళ్లించే ప్రయత్నం చేయండి. ఇందులో భాగంగా కుటుంబ సమేతంగా ఎక్కువ సమయం గడపడానికి ఉన్న అవకాశాలను మీరు పరిశీలించండి. వీకెండ్‌లో విహారయాత్రలు, షాపింగ్‌కు వెళ్లడం వంటివి ప్లాన్ చేయండి. అప్పటికీ అతని ఆలోచనల్లో.. ఏమైనా మార్పు రాకపోతే ఒకసారి సైక్రియాటిస్ట్‌లను సంప్రదించండి. వారు అన్ని వివరాలు పరిశీలించి మీకు తగిన సలహాలు సూచిస్తారు.
ఇవీ చదవండి :