తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్-నేపాల్ సంబంధాలు ఎన్నడూ క్షీణించలేదు'

భారత్-నేపాల్ మధ్య సంబంధాలు క్షీణించలేదని నేపాల్ మంత్రి రామ్​బిర్ మనంధర్ తెలిపారు. కరోనా కారణంగా వర్తకానికి ఆటంకాలు ఎదురయ్యాయని, త్వరలోనే అదికూడా పునరుద్ధరణ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య లోతైన బంధం ఉందన్నారు.

Relations with India never deteriorated: Nepal Minister
'భారత్-నేపాల్ సంబంధాలు ఎన్నడూ క్షీణించలేదు'

By

Published : Feb 4, 2021, 8:25 AM IST

భారత్-నేపాల్ మధ్య సంబంధాలు ఎన్నడూ క్షీణించలేదని నేపాల్ పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రామ్​వీర్ మనంధర్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య లోతైన బంధం ఉందని చెప్పారు. భారత్-నేపాల్ సంబంధాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం కోసం దిల్లీకి వచ్చిన ఆయన.. ఈటీవీ భారత్​తో మాట్లాడారు.

ఈటీవీ భారత్​ ప్రతినిధితో మంత్రి రామ్​వీర్

కరోనా కారణంగా ఇరుదేశాల వర్తకానికి ఆటంకం ఎదురైనప్పటికీ.. త్వరలోనే పూర్తిస్థాయిలో పునరుద్ధరణ అవుతాయని తెలిపారు మనంధర్. కరోనాపై పోరులో భారత్ సహకారాన్ని ప్రశంసించారు. నేపాల్​కు మరో 10 లక్షల డోసులు పంపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:రైతు ఆందోళనలపై బ్రిటన్​ పార్లమెంటులో చర్చ?

ABOUT THE AUTHOR

...view details