తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'18 ప్లస్​'కు టీకా రిజిస్ట్రేషన్.. నేటినుంచే - కొవిన్ పోర్టల్ కరోనా టీకా

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా టీకా కార్యక్రమం పరిధిలోకి.. 18ఏళ్లు పైబడిన వారిని కూడా తీసుకొచ్చిన కేంద్రం.. వారికి మే 1 నుంచి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించింది. అందుకోసం వారంతా ఏప్రిల్ 28 నుంచి 'కొవిన్' వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. మరి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో మీకు తెలుసా?

REGISTRATION STARTS FOR COVID VACCINE
కరోనా టీకా రిజిస్ట్రేషన్

By

Published : Apr 27, 2021, 8:19 PM IST

Updated : Apr 28, 2021, 9:42 AM IST

దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చి.. రికార్డు స్థాయిలో కొత్త కేసుల నమోదుకు కారణం అవుతోంది. మరోవైపు టీకా పంపిణీ కార్యక్రమం సైతం వేగంగా సాగుతోంది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరినీ టీకా అర్హుల జాబితాలో చేర్చిన కేంద్రం.. వారికి మే 1 నుంచి వ్యాక్సిన్ అందించనుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 28న ప్రారంభం కానుంది. కొవిన్ పోర్టల్ సహా, ఆరోగ్య సేతు అప్లికేషన్​లో టీకా కోసం రిజిస్టర్ అవ్వొచ్చు.

కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ఇలా..

  • ⇒ మొదట కొవిన్ పోర్టల్‌(cowin.gov.in)లో లాగిన్ అయి, మొబైల్ నంబర్ నమోదుచేయాలి. ఆ వెంటనే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.
  • ⇒ ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై బటన్‌ను క్లిక్ చేయాలి. అంతా ఓకే అయితే 'రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్' పేజ్‌ ఓపెన్ అవుతోంది.
  • ⇒ దాంట్లో ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
  • ⇒ ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే, టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. దానికోసం పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్‌ను క్లిక్ చేయాలి.
  • ⇒ పిన్‌కోడ్ ఎంటర్ చేసి, వెతికితే దాని పరిధిలోకి టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకొని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి.

ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకొనే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాకుండా టీకా కోసం ఆరోగ్య సేతు, ఉమాంగ్​ యాప్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఇదీ చదవండి:ఈ పరికరంతో 2 నిమిషాల్లోనే కరోనా ఫలితం!

Last Updated : Apr 28, 2021, 9:42 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details