Red sandalwood smuggling: ఎర్ర చందన అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు గుజరాత్ పోలీసులు. కచ్ జిల్లాలోని ముంద్రా పోర్ట్ గుండా హాంగ్‌కాంగ్ తరలిస్తున్న ఎర్ర చందనాన్ని బుధవారం పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు దిల్లీకి చెందిన కంటెయినర్‌ను తెరిచి చూడగా.. సుమారు 12-13 టన్నుల ఎర్ర చందనం గుర్తించినట్లు గాంధీధామ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలీజెంట్ (డీఆర్ఐ) అధికారులు వెల్లడించారు. వాటి విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని తెలిపారు.
రూ.5 కోట్లు విలువైన వజ్రాలు..
Diamonds smuggling: చెన్నై విమానాశ్రయంలో రూ.5 కోట్లకుపైగా విలువైన వజ్రాలను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. బ్యాగులోని టెలిస్కోపిక్ హ్యాండిల్లో దాచి తరలిస్తుండగా పట్టుకున్నారు. దుబాయ్ వెళ్లే వ్యక్తి వద్ద డైమండ్లు ఉన్నట్లు వచ్చిన సమాచారంతో.. నిఘా పెట్టారు అధికారులు. అనుమానిత ప్రయాణికుడి బ్యాగును తనిఖీ చేయగా.. టెలిస్కోపిక్ హ్యాండిల్లో దాచి ఉంచిన వజ్రాలు బయటపడ్డాయి.