తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎర్రకోట ఘటనలో దీప్​ సిద్ధూకి 7 రోజుల కస్టడీ - delhi

ఎర్రకోట ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్​ నటుడు దీప్​ సిద్ధూకు 7 రోజుల పోలీసు కస్టడీ విధించింది దిల్లీ న్యాయస్థానం. రిపబ్లిక్​ డే రోజు రైతుల నిరసనలు హింసాత్మకంగా మారడం వెనుక ఆయన హస్తం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు.

Red Fort violence: Actor-activist Deep Sidhu sent to 7 days police custody
7 రోజుల పోలీస్​ కస్టడీలోకి దీప్​ సిద్ధూ

By

Published : Feb 9, 2021, 7:42 PM IST

పంజాబ్​ నటుడు, గాయకుడు దీప్​ సిద్ధూకు 7 రోజుల పోలీసు కస్టడీ విధించింది దిల్లీ కోర్టు. గణతంత్ర దినోత్సవం రోజు ఎర్ర కోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 26న దిల్లీలో రైతులు ట్రాక్టర్​ ర్యాలీ చేపట్టారు. అయితే అవి హింసాత్మకంగా మారడం వెనుక సిద్ధూ పాత్ర ఉందని కోర్టుకు పోలీసులు తెలిపారు.

సిద్ధూ ఆచూకీ తెలిపిన వారికి గతంలో రూ.లక్ష బహుమతి ప్రకటించారు దిల్లీ పోలీసులు. చండీగడ్​​, అంబాలా మధ్యలోని జిరాక్​పుర్​ ప్రాంతంలో మంగళవారం ఆయనను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి:'దిల్లీ హింసకు దీప్​ సిధు లాంటి విద్రోహ శక్తులే కారణం'

ABOUT THE AUTHOR

...view details