తెలంగాణ

telangana

ETV Bharat / bharat

6-12 ఏళ్ల పిల్లలపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్! - కొవాగ్జిన్​ క్లినికల్​ ట్రయల్స్​ ఎయిమ్స్​

6-12 ఏళ్ల వయసు వారిపై కొవాగ్జిన్​ క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించేందుకు పిల్లల ఎంపికను మంగళవారం ప్రారంభిస్తున్నట్లు దిల్లీ ఎయిమ్స్​ వైద్యులు పేర్కొన్నారు. మొత్తం మూడు దశల్లో వైద్యులు క్లినికల్​ ట్రయల్స్​ను నిర్వహిస్తున్నారు.

covaxin children clinical trials, aiims clinical trials covaxin
రెండో దశ క్లినికల్​ ట్రయల్స్​కు పిల్లల నియామకం

By

Published : Jun 14, 2021, 5:25 PM IST

Updated : Jun 14, 2021, 5:31 PM IST

దిల్లీ ఎయిమ్స్​లో 6-12 ఏళ్ల వయసు వారిపై కొవాగ్జిన్​ క్లినికల్​ ట్రయల్స్​కు సంబంధించి పిల్లల నియామకం మంగళవారం ప్రారంభం కానున్నట్లు ఎయిమ్స్​ వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు ఎయిమ్స్​ వైద్యులు డాక్టర్​ సంజయ్​ రాయ్​ సోమవారం ప్రకటించారు.

ఈ క్లినికల్​ ట్రయల్స్​ను మూడు విడతల్లో నిర్వహిస్తున్నారు. తొలి విడతలో 12-18 ఏళ్ల వారికి, రెండో విడతలో 6-12 ఏళ్ల పిల్లలకు, మూడో విడతలో 2-6 ఏళ్ల వారికి పరీక్షలు చేస్తారు. ఇప్పటికే 12-18 ఏళ్ల వారి ఎంపిక పూర్తి అయ్యి.. వారికి మొదటి డోసును కూడా అందించారు. 6-12 ఏళ్ల వారిపై క్లినికల్​ ట్రయల్స్​ పూర్తి అయ్యాక వైద్యులు.. 2-6 ఏళ్ల పిల్లలపై పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి విడతలోనూ 175 మందిపై క్లినికల్​ ట్రయల్స్​ జరపుతారు.

ఇదీ చదవండి :Vaccination: డ్రోన్లతో పల్లెలకు టీకాలు

Last Updated : Jun 14, 2021, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details