Ajmer lake currency notes: రాజస్థాన్ అజ్మేర్లోని ఆనాసాగర్ సరస్సులో 2000 రూపాయల నోట్ల కట్టలు తేలియాడాయి. పాలిథీన్ బ్యాగులో ఉన్న వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉన్నాయని, అన్నీ రూ.2వేల నోట్లే అని అధికారులు చెప్పారు. పుష్కర్ రోడ్డులోని ఈ సరస్సులో భారీగా కరెన్సీ నోట్లు ఉన్నాయని తమకు సమాచారం అందిందని, వచ్చి చూస్తే నిజంగానే నోట్ల కట్టలు ఉన్నాయని చెప్పారు.
సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు - రాజస్థాన్ న్యూస్
రాజస్థాన్లోని ఓ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు కొట్టుకురావడం స్థానికులను షాక్కు గురిచేసింది. పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లి వీటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే నకిలీవా, ఒరిజినలా తెలియాల్సి ఉంది.
Bundles of 2000 notes: అయితే ఈ నోట్లు నకిలీవా? లేక నిజమైనవా? అనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చూడటానికి మాత్రం నిజమైన నోట్ల లాగే ఉన్నాయని, నీటిలో తడవడం వల్ల నిర్ధారించుకోలేకపోతున్నట్లు చెప్పారు. నిపుణుల సాయంతో నోట్ల అసలువో, కాదో తెలుసుకుంటామన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ నోట్ల కట్టలను పాలిథీన్ బ్యాగులో పెట్టి సరస్సులో విసిరేశారని వివరించారు. మొదట నకిలీ నోట్లు అనుకున్నప్పటికీ, వాటిని చూశాక అసులవేమో అనే సందేహం వచ్చిందని అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి:యువతుల మధ్య చిగురించిన ప్రేమ.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే?